భారత యువత సత్తాకు స్టార్టప్‌లే నిదర్శనం 20వ రోజ్‌గార్ మేళాలో 51,000 మందికి పైగా నియామక పత్రాల పంపిణీ భారత్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరణ చిన్న నగరాల్లోనూ స్టార్టప్‌లు వస్తుండటం శుభపరిణామం అన్న ప్రధాని రూ. లక్ష కోట్లతో ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన
అర్జున్ సమాచారం: కొత్తగా చేరిన ఉద్యోగులకు నిరంతర అభ్యాసంపై ప్రధాని మోదీ సూచన దేశ యువత సామర్థ్యానికి, వారి సత్తాకు దేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థే ఒక గొప్ప ఉదాహరణ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒకప్పుడు కేవలం పెద్ద నగరాలకే పరిమితమైన స్టార్టప్‌ల కథ ఇప్పుడు చిన్న పట్టణాలకు, నగరాలకు కూడా విస్తరించిందని ఆయన పేర్కొన్నారు. 20వ రోజ్‌గార్ మేళా సందర్భంగా శనివారం ఆయన వివిధ ప్రభుత్వ సంస్థలకు కొత్తగా ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 45...