భారీ పెట్టుబడి మోసం కేసును ఛేదించిన కరీంనగర్ పోలీసులు

కరీంనగర్,అర్జున్ సమాచారం: కరీంనగర్‌లో భారీ స్థాయిలో జరిగిన పెట్టుబడి మోసం కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. పెట్టుబడి పథకాల ద్వారా ప్రజలను ఆకర్షించి కోట్లాది రూపాయలు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు హేమంత్ కుమార్ రాయ్తో పాటు రాజేష్ కుమార్, బ్రిజేష్ కుమార్ మిశ్రాలను పోలీసులు అరెస్ట్ చేశారు. 2020లో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో స్థాపించిన ఈ సంస్థ ద్వారా వివిధ పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టి తక్కువ కాలంలో పెట్టుబడులకు రెండింతలు, మూడింతలు లాభాలు వస్తాయని నమ్మబలికినట్లు విచారణలో వెల్లడైంది. నెట్‌వర్క్ చైన్...