భారీ వర్షాలతో వంశధార, నాగావళి నదులకు వరద ఉద్ధృతి గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ నారాయణపురం ఆనకట్ట వద్ద కూడా మొదటి ప్రమాద హెచ్చరిక నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన నదుల్లోకి ఈత, చేపల వేటకు వెళ్లొద్దని విపత్తుల సంస్థ హెచ్చరిక
అర్జున్ సమాచారం: భారీ వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలోని ప్రధాన నదులైన వంశధార, నాగావళిలో వరద ఉద్ధృ క్రమంగా పెరుగుతోంది. నదీ ప్రవాహం పోటెత్తుతుండటంతో అధికారులు ప్రధాన బ్యారేజీల వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రస్తుతం ఈ బ్యారేజ్‌లోకి 41,014 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా,...