భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండండి జిల్లా కలెక్టర్లు, పోలీస్ అధికారులకు సి.ఎస్. ఆదేశం

హైదరాబాద్, జులై 30,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏవిధమైన ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నందున చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్. పి లతో  సి.ఎస్  సంజయ్ జాజు గురువారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సాయంత్రం  వీడియో...