భీమారంలో ఓటర్లకు అందని ‘సర్’ ఫారాలు! నత్త నడకన సాగుతున్న సర్ ప్రక్రియ *ఎప్పుడు ఇస్తారని ప్రశ్నిస్తున్న ఓటర్లు *జూలై 24 ఆఖరి గడువు.. ఇంకా మెజారిటీ ఓటర్లకు అందని వైనం

భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, జూలై 10: ఓటరు జాబితా పారదర్శకత, సవరణల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్’ ( ప్రత్యేక సమగ్ర పునశ్చరణ) కార్యక్రమం భీమారం మండలంలో నత్తనడకన సాగుతోంది. ఓటర్ల వివరాల వెరిఫికేషన్ కోసం పంపిణీ చేయాల్సిన ‘సర్’ ఫారాలు ఇప్పటివరకు మండలంలోని మెజారిటీ ఓటర్లకు చేరకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటరు జాబితాను పక్కాగా రూపొందించేందుకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమైనప్పటికీ, క్షేత్రస్థాయిలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. మండలంలోని కొన్ని ప్రాంతాల్లో బూత్...