భీమారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు(రెవెన్యూ) కలెక్టర్ వి. రాములుఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం
భీమారం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన అదనపు(రెవెన్యూ) కలెక్టర్ వి. రాములుఎస్‌ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశం. భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, సెప్టెంబర్ 18 : మంచిర్యాల జిల్లా భీమారం తహశీల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న ఎస్‌ఐఆర్ (సమ్మరీ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ సవరణ ప్రక్రియ పురోగతిని ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించారు....