భీమారం బీసీ బాలుర హాస్టల్‌లో సీసీ కెమెరాల ఏర్పాటు:
భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం,జూలై 19: ప్రజల భద్రతకు పోలీసు శాఖ ప్రాధాన్యత భీమారం మండలంలోని బీసీ బాలుర హాస్టల్‌లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 4 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భీమారం మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీ చేకుర్తి సత్యనారాయణ రెడ్డి ఆర్థిక సహకారాన్ని అందించి, భద్రత పట్ల తమ బాధ్యతను చాటుకున్నారు. ఈ సందర్భంగా భీమారం ఎస్‌ఐ శ్రీ A. రాజేందర్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో జరుగుతున్న సంఘటనలను దృష్టిలో...