భీమారం మండల కేంద్రంలో ప్రజాధనం వృథా: బృహత్ ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం ధ్వంసంపై భగ్గుమంటున్న ప్రజలు అభివృద్ధి అంటే కూల్చడం కాదు.. ఉన్నదాన్ని కాపాడటమేనన్న బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు రాజకుమార్ కలగూర

భీమారం (మంచిర్యాల), అర్జున్ సమాచారం, జూలై 19:   ప్రభుత్వం మారిన ప్రతిసారీ గత ప్రభుత్వం చేపట్టిన పనులను, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం రాజకీయ సంప్రదాయంగా మారిందని, ఇది ప్రజల సొమ్ముకు చేస్తున్న ద్రోహమని భీమారం బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు రాజకుమార్ కలగూర విమర్శించారు. గత ప్రభుత్వం ప్రజల పన్నుల సొమ్ముతో సుమారు ₹25 లక్షల వ్యయంతో 10 ఎకరాల్లో అభివృద్ధి చేసిన బృహత్ ప్రకృతి వనాన్ని, మరో ₹3–4 లక్షలతో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాన్ని ప్రస్తుత పాలకులు తొలగించడంపై ఆయన...