భీమారం-5 అంగన్‌వాడీ కేంద్రంలో నాసిరకం గుడ్ల కలకలం! * పురుగులు పట్టిన పప్పు, కుళ్లిన గుడ్ల సరఫరా * పర్యవేక్షణ కరువైందని అధికారులపై తల్లిదండ్రుల ఆగ్రహం * ఒకేచోట రెండు కేంద్రాలు.. దూరభారంతో పిల్లల అవస్థలు
భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, జూలై 09: స్థానిక భీమారం-5 అంగన్‌వాడీ కేంద్రంలో తీవ్ర కలకలం రేగింది. పౌష్టికాహారం అందించాల్సిన కేంద్రంలోనే పిల్లలకు నాసిరకం, అనారోగ్యకరమైన ఆహారాన్ని సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు నిబంధనలను తుంగలో తొక్కి, పిల్లల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. కేంద్రంలో పిల్లలకు అందిస్తున్న ఆహారంలో నాణ్యత పూర్తిగా లోపించిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుగులు పట్టిన పప్పుతో వంటలు చేయడం, కుళ్లిన కోడిగుడ్లను ఉడికించి చిన్నారులకు పెట్టడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఇలాంటి నాసిరకం, కుళ్లిన ఆహారం తిని పిల్లలకు...