భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టాలి: కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్,అర్జున్ సమాచారం: జిల్లాలో చేపట్టిన కీలక సాగునీటి, రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రెవెన్యూ, ఇరిగేషన్‌తో పాటు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించాలని స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో రెవెన్యూ, ఇరిగేషన్, భూ సేకరణ విభాగం, నేషనల్ హైవేస్ అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రత్యేక సమీక్ష...