మంగళగిరి ప్రజల దశాబ్దాల కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోంది! భారీ మెజారిటీతో గెలిపించడం వల్లే పెద్దఎత్తున అభివృద్ధి పనులు మంగళగిరి ప్రజలే నా కుటుంబం… వారి ఆశీస్సులే కొండంత బలం ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నా మన ఇల్లు – మన లోకేష్ రెండోరోజు కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్
మంగళగిరి,అర్జున్ సమాచారం: రాష్ట్రమంతా మంగళగిరి వైపు చూసేవిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు నాకు ప్రజల ఆశీస్సులు కావాలి, మంగళగిరి నియోజకవర్గం నా సొంత కుటుంబం, ఇక్కడి ప్రజల దీవెనలే తనకు కొండంత బలాన్నిస్తాయని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మన ఇల్లు – మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా స్థానిక సికె కన్వెన్షన్ సెంటర్ లో రెండోరోజు మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు శాశ్వత పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా...