మంత్రి నారా లోకేష్ ను కలిసిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తుగ్గలి రంగ పత్తికొండ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు కృషి చేయాలని మంత్రిని కోరిన తుగ్గలి రంగ
తుగ్గలి:అర్జున్ సమాచారం: రైతుల సంక్షేమం,మార్కెట్ యార్డుల అభివృద్ధి,ఆధునీకరణ అంశాలపై పత్తికొండ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తుగ్గలి రంగ పత్తికొండ శాసనసభ్యులు కేఈ శాంబాబు ఆధ్వర్యంలో గురువారం మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పత్తికొండ మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు ప్రభుత్వం చొరవ చూపాలని మంత్రికి ఆయన తెలియజేశారు.వర్షాకాలంలో మార్కెట్ యార్డు నందు నీరు నిల్వ ఉండి మార్కెట్ యార్డ్ బురదమయంగా మారుతుందని, కావున మార్కెట్ యార్డ్ నందు సిమెంట్ బెడ్ నిధుల కొరకు ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన తెలియజేశారు.అదేవిధంగా...