మంచిర్యాల,అర్జున్ సమాచారం:
ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ తో కలిసి
మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఊరు మందమర్రి ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రమును అకస్మికంగా సందర్శించి వైద్యాధికారికి వైద్యులకు సిబ్బందికి తగు సూచనలు ఆదేశాలు ఇవ్వడం జరిగినది జిల్లాలో క్యాచప్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ఈరోజు నుండి 31 తేదీ వరకు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా పిల్లలందరికీ టీకాలు ఇప్పించడంలో భాగంగా కొత్తగా వచ్చిన పిల్లలు గానీ తప్పిపోయిన పిల్లలు కానీ వ్యాక్సినేషన్ ఇప్పించడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని ఉపకేంద్రముల పరిధిలోని ఆరోగ్య కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టుతున్నట్టు తెలియజేయడం జరిగినది ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించడము ఇవి పిల్లలకు ఆరోగ్య వరాలు ఇందులో భాగంగా జిల్లాలోని పిల్లలందరికీ వాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుంది కావున ఆరోగ్య కార్యకర్తలు తమ పరిధిలోని పిల్లల వివరములను దగ్గర ఉంచుకొని వాక్సినేషన్ చేయాలని వ్యాక్సినేషన్‌ను సరైన రీతిలో సరైన పద్ధతిలో చేయాలని ఆదేశించినారు
అదేవిధంగా కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా సర్వే కార్యక్రమంలో ఉదయం సందర్శించి వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంలో ముమ్మరంగా పాల్గొనాలని ఆదేశించినారు అదేవిధంగా వాతావరణ మార్పులతో వచ్చే వ్యాధులు దగ్గు జలుబు జ్వరము వైరల్ జ్వరాలు కీటకజనిత వ్యాధులు దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటివి ప్రబలకుండా చర్యలు చేపట్టాలని స్థానిక సర్పంచులు గ్రామపంచాయతీ సహకారంతో మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ సిబ్బంది కార్పోరేటర్లు సహాయంతో పరిసరాల పరిశుభ్రత చేయించాలని కోరినారు అదేవిధంగా మనమందరము వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలి గోరువెచ్చని నీటిని త్రాగడం వల్ల జలుబు దగ్గును దూరం చేయవచ్చును ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని ఆదేశించినారు ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యులు డాక్టర్ లక్ష్మీప్రసన్న జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ సిహెచ్ వోలు నామదేవ్ పుట్ట సత్తయ్య శ్రీనివాస్ అల్లాడి శ్రీనివాస్ విజయ ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఊరు మందమరి ఉప కేంద్రంలో అందించిన వైద్య సేవలను పరిశీలించడం జరిగినది అదేవిధంగా అంగన్వాడీ కేంద్రంలో గర్భవతులకు పిల్లలకు అందిస్తున్న పౌష్టికారాన్ని పరిశీలించడం జరిగినది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా ఉపకేంద్రం పరిధిలో శుభ్రత పాటించాలని ఆదేశించినారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నమోదు చేస్తున్న వివరములను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడం జరిగినది జిల్లాలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యులు సమయపాలన పాటించాలని సమన్వయంతో వైద్య ఆరోగ్య సేవలు అందించాలని ఆదేశించినారు.