మనంసైతం’ ద్వారా పేద సినీ క‌ళాకారులకు అనేక సేవ కార్యక్ర‌మాలు – కాదంబరి కిరణ్ ‘మనంసైతం’ నుంచి మరో బృహత్తర కార్యక్రమం ‘సపర్య’ ప్రాజెక్ట్‌ను ప్రక‌టించిన కాదంబరి కిరణ్ ▪️ అనాథలు, ఒంటరి వృద్ధులు, పేదలకు అండగా ‘వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్’ ▪️ పేద సినీ క‌ళాకారుల కోసం అనేక సేవ కార్యక్ర‌మాలు ▪️ సినీ కార్మికుల పిల్లలకు ఉచిత నీట్, ఐఐటీ శిక్షణ ▪️ ‘మనంసైతం’ సేవ‌ల‌కు 13 వ‌సంతాలు పూర్తి

హైదరాబాద్: ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం.. ఆర్థికంగా వెనుకబడిన వారికి భరోసా ఇవ్వడం.. ఒంటరిగా మిగిలిన వృద్ధులకు తోడుగా నిలవడం.. సేవను ఒక కార్యక్రమంగా కాకుండా బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ మరో బృహత్తర సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘సపర్య – వుయ్ కేర్ ఫర్ అన్ కేర్డ్’ పేరుతో నూతన ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, నటుడు కాదంబరి కిరణ్ ప్ర‌క‌టించారు. హైద‌రాబాద్‌లోని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. గత...