మన గ్రామానికి గర్వకారణం కోహెడ
కోహెడ,అర్జున్ సమాచారం: సిద్దిపేట జిల్లా కోహెడ మండలం చెంచర్ పల్లె గ్రామానికి చెందిన కంకనాల పర్షురామ్ రెడ్డి తన బృందంతో కలిసి జాతీయ స్థాయి ప్రాజెక్ట్ పోటీలలో పాల్గొని ప్రథమ బహుమతి సాధించడం ఎంతో గర్వకారణం. మహిళలు నెలసరి సమయంలో ఎదుర్కొనే కడుపునొప్పి, అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడేలా 'పీరియడ్' నొప్పి నివారణ పరికరం రూపొందించి,తన మొదటి పరికరంతోనే జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి సాధించడం విశేషం. మన చెంచర్ పల్లె గ్రామం నుంచి ఇలాంటి వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చి జాతీయ స్థాయిలో విజయం...