ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 06 November 2026, 6:44 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మహాకాళి’ నుంచి సినిమా ఫస్ట్ సాంగ్ ‘అయిగిరి నందిని’

ఆర్‌కే దుగ్గల్ సమర్పణలో, ఆర్‌కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న చిత్రం ‘మహాకాళి’. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న చిత్రమిది. పూజ
అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, శ్రీయా రెడ్డి, రోహిత్ సారఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి తొలి పాట ‘అయిగిరి
నందిని’ ని విడుదల చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌ను భక్తి భావంతో ప్రారంభించారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు రచించి, స్వరపరిచిన మహాకాళి అమ్మవారికి అంకితమైన ఈ శాశ్వత స్తోత్రాన్ని ఆధారంగా
చేసుకుని రూపొందించిన ఈ పాట భక్తి భావం, పవర్ ఫుల్ వాయిస్, అద్భుతమైన విజువల్ స్టోరీటెల్లింగ్‌తో ఆకట్టుకుంటోంది.
సంగీత దర్శకుడు స్మరణ్ సాయి ఈ ఐకానిక్ భక్తి గీతాన్ని సరికొత్తగా ఆవిష్కరించిన తీరు అద్భుతంగా వుంది. ఆధ్యాత్మికతను ఏమాత్రం తగ్గించకుండా, అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్‌తో పాటకు గ్రాండ్ మ్యూజికల్
స్కేల్ తీసుకొచ్చారు. పాట క్రమంగా ఇంటెన్స్  పెంచుకుంటూ, దైవిక నేపథ్యానికి చక్కగా సరిపోయే గొప్ప సంగీత అనుభూతిని అందిస్తోంది. అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయి చరణ్  పవర్ ఫుల్ వాయిస్
పాటకు ప్రాణం పోశారు.
విజువల్ పరంగానూ ఈ పాట ఎంతో ఆకట్టుకుంటోంది. మహాకాళి అమ్మవారి పాత్రలో శ్రీయా రెడ్డి అద్భుతమైన రూపంలో కనిపించారు.  మహాకాళి అమ్మవారి దివ్య రూపంలో ఆమె కనిపించిన తీరు విశేషంగా
ఆకట్టుకుంటోంది.   ఈ విజువలైజేషన్‌లో అత్యంత అందమైన అంశం అమ్మవారిని మాతృమూర్తిగా చూపించిన విధానం. ఉగ్రరూపంలో దర్శనమిస్తూనే ఒక పసిబిడ్డకు పాలిస్తున్నట్లుగా అమ్మవారిని
చూపించడం ఎంతో ప్రత్యేకంగా ఉంది. చెడును సంహరించే అపారమైన శక్తి, తల్లిగా అంతులేని కరుణ.. అమ్మవారిలోని ఈ రెండు అద్భుతమైన కోణాలను ఈ సన్నివేశం చక్కగా ఆవిష్కరిస్తోంది. శ్రీయా రెడ్డి
పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ పాటలోని భక్తి భావాన్ని మరింత పెంచింది.
స్మరణ్ సాయి అద్భుతమైన ఆర్కెస్ట్రేషన్, గాయకుల ఎనర్జిటిక్ గానం, మహాకాళి అమ్మవారి గ్రాండ్ విజువల్ ప్రజెంటేషన్ కలిపి ఎన్నో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించే, గూస్‌బంప్స్  మూమెంట్స్
అందిస్తున్నాయి. సంగీతం, విజువల్స్ సమన్వయంతో ‘అయిగిరి నందిని’ పాట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తుండగా, సురేష్ రగుటు సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు.
‘అయిగిరి నందిని’ పాటతో ‘మహాకాళి’ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మేకర్స్ అద్భుతంగా ప్రారంభించారు. ఈ చిత్రం 2027 జనవరి 8న సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.
నటీనటులు:
భూమి శెట్టి, అక్షయ్ ఖన్నా, రోహిత్ సారఫ్…