మహాగం బాలికల ఆశ్రమ పాఠశాలలో వైద్య శిబిరాన్ని పరిశీలించిన జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్ విద్యార్థినుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: చైర్మన్ ఆశ్రమ పాఠశాలలో ముమ్మరంగా రక్త పరీక్షల శిబిరం

సిర్పూర్, జూలై 15,అర్జున్ సమాచారం: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావ్ బుధవారం సిర్పూర్ (యు) మండల కేంద్ర పరిధిలోని మహాగం ప్రభుత్వ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను హఠాత్తుగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని (రక్త పరీక్షల కేంద్రం) ఆయన దగ్గరుండి పరిశీలించారు. వైద్య సిబ్బంది విద్యార్థినులకు నిర్వహిస్తున్న పరీక్షల వివరాలను, నమోదవుతున్న ఫలితాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ...