మహిళా సంఘాలే మాదకద్రవ్య రహిత సమాజానికి ‘సంఘమిత్రలు’ మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి మహిళ భాగస్వామి కావాలి 112కు సమాచారం ఇవ్వండి.. యువత భవిష్యత్తును కాపాడండి: వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత జనగామను మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
వరంగల్,అర్జున్ సమాచారం: మాదకద్రవ్యాల నిర్మూలనలో మహిళా సంఘాల పాత్ర అత్యంత కీలకమని, ప్రతి మహిళ తన కుటుంబంతో పాటు గ్రామాలు, పట్టణాలను కూడా మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడే ‘సంఘమిత్ర’గా వ్యవహరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని మహిళా సంఘాల సభ్యులకు ‘సంఘమిత్ర – మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజమహేంద్ర నాయక్లతో...