సిద్దిపేట,అర్జున్ సమాచారం:
ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు
చేతినిండా పని, వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బు ఉన్నప్పటికీ కేవలం ప్రజాసేవ చేయాలనే గొప్ప స్ఫూర్తితోనే సరస్వతమ్మ గారు రాజకీయాల్లోకి వచ్చారు.
తమ సొంత కష్టార్జితాన్ని సైతం గ్రామం కోసం, ప్రజల కోసం వెచ్చించిన ఆదర్శవంతమైన కుటుంబం వారిది.
ఆమె ఎంతో ప్రేమగల మనిషి. చాలా ఓపిక, సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరినీ పల్లెత్తు మాట అనేవారు కాదు.
ఎంతటి హోదాలో ఉన్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా, గ్రామ సమస్యల మీద అధికారులను, నాయకులను నిక్కచ్చిగా అడిగే స్వభావం ఆమెది.
మన నియోజకవర్గంలోనే ప్రభుత్వ నిధులతో నిర్మించిన మొట్టమొదటి ఫంక్షన్ హాల్ సరస్వతమ్మ గారి పట్టుదల, కృషితోనే మంజూరైంది.
గ్రామంలో అన్ని కులాలకు కమ్యూనిటీ హాళ్లు, బూరుపల్లి డబుల్ రోడ్డు, బండ చిలపల్లి రోడ్డు, మురుగు కాల్వల నిర్మాణం కోసం నిరంతరం శ్రమించారు.
పెద్దగా చదువుకోకపోయినా, 22-24 మంది ఎంపీటీసీలు ఉన్న పెద్ద మండలాన్ని రెండు పర్యాయాలు ఎంపీపీగా అత్యంత సమయస్ఫూర్తితో నడిపించారు.
కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాక, సిద్దిపేటలో గెలిచిన మొట్టమొదటి టీఆర్ఎస్ ఎంపీపీ సరస్వతమ్మ.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నాలు, పోరాటాల్లో కేసీఆర్ గారి వెన్నంటి నడిచారు. అందుకే కేసీఆర్ కూడా ఆమె అంటే ఎంతో ప్రేమ, గౌరవం ఉండేవి.
మహారాష్ట్రలో వ్యాపారపరంగా అత్యంత ముఖ్యమైన పనులున్నా వదులుకుని, భార్యపై మరియు ఊరిపై ఉన్న ప్రేమతో నారాయణ గౌడ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మూడవ వర్ధంతి సందర్భంగా ఊర్లోని అన్ని కులాల వారి సౌకర్యార్థం సొంత ఖర్చులతో వైకుంఠ రథాన్ని విరాళంగా ఇవ్వడం, పేదలకు చీరలు పంచడం గొప్ప విషయం మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.
===================