మాజీ ఎంపీపీ మెరుపుల సరస్వతి తృతీయ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

సిద్దిపేట,అర్జున్ సమాచారం: ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు చేతినిండా పని, వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బు ఉన్నప్పటికీ కేవలం ప్రజాసేవ చేయాలనే గొప్ప స్ఫూర్తితోనే సరస్వతమ్మ గారు రాజకీయాల్లోకి వచ్చారు. తమ సొంత కష్టార్జితాన్ని సైతం గ్రామం కోసం, ప్రజల కోసం వెచ్చించిన ఆదర్శవంతమైన కుటుంబం వారిది. ఆమె ఎంతో ప్రేమగల మనిషి. చాలా ఓపిక, సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తి, ఎవరినీ పల్లెత్తు మాట అనేవారు కాదు. ఎంతటి హోదాలో ఉన్నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా, గ్రామ సమస్యల మీద అధికారులను,...