మాది అభివృద్ధి, వారిది విధ్వంసం.. గొడ్డలి పార్టీ హింసను వీడి జనస్రవంతిలో కలవాలి: సీఎం చంద్రబాబు బెంగళూరు నుంచి వచ్చి హిట్ అండ్ రన్ తరహాలో వ్యవహరిస్తున్నారని విమర్శ స్థానిక ఎన్నికలు ఆపేందుకు 62 పిటిషన్లు వేశారని ఆరోపణ కూటమి అభ్యర్థులకే సహకరించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు విజ్ఞప్తి ప్రజలు మరోసారి ఆశీర్వదించి అభివృద్ధికి సహకరించాలని కోరిన సీఎం
అమరావతి,అర్జున్ సమాచారం: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీపై 'గొడ్డలి పార్టీ' అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ హింసాత్మక విధానాలను విడనాడి, జనజీవన స్రవంతిలో కలవాలని హితవు పలికారు. ఈరోజు ఎన్డీఏ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొడ్డలి పార్టీ తీరు రాజకీయ పార్టీలా లేదని, రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తోందని ధ్వజమెత్తారు. తీవ్రవాదుల తరహాలో 'హిట్ అండ్ రన్': గొడ్డలి పార్టీ నేతల వైఖరి తీవ్రవాదుల తరహాలో ఉందని చంద్రబాబు...