మారేడుమిల్లిలో 1/70 చట్టం బేఖాతరు.. అనుమతులు లేకుండా రిసార్ట్స్ నిర్మాణాల దందా
మారేడుమిల్లి మండలం.అర్జున్ సమాచారం: గిరిజనుల భూములకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని మారేడుమిల్లిలో తుంగలో తొక్కుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులు ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టకూడదన్న నిబంధన ఉన్నా, పర్యాటకం ముసుగులో రిసార్ట్స్ పేరుతో భారీ కాంక్రీట్ భవనాలు వెలిసిపోతున్నాయి. 1/70 చట్టం ఏం చెబుతోంది ? ఏపీ షెడ్యూల్డ్ ఏరియా ల్యాండ్ ట్రాన్స్ ఫర్ రెగ్యులేషన్ 1/70 చట్టం ప్రకారం ఏజెన్సీలో గిరిజన భూమిని గిరిజనేతరులకు అమ్మడం, బదలాయించడం, లీజుకు ఇవ్వడం పూర్తిగా నిషేధం. ఒకవేళ లీజు తీసుకున్నా వ్యవసాయానికి మాత్రమే తీసుకోవాలి,...