మార్చి నాటికి భారత్‌లో ఎండలతో 55 వేల మరణాల ముప్పు? ఎల్‌నినోపై కొత్త అంచనా! మార్చిలోనే ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉందని వెల్లడి ప్రపంచవ్యాప్తంగా 3.73 లక్షల మరణాల అంచనా నైజీరియాలో 56 వేల మరణాల ప్రమాదం ఉందన్న క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ ఎల్‌నినో ప్రభావం 2027 ప్రారంభం వరకు కొనసాగే అవకాశం

న్యూఢిల్లీ, అర్జున్ సమాచారం: భారత్‌కు ఎల్‌నినో రూపంలో మరో వాతావరణ ముప్పు పొంచి ఉందా? రాబోయే నెలల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు ప్రాణనష్టాన్ని పెంచే ప్రమాదం ఉందని తాజా పరిశోధన ఆధారిత అంచనాలు హెచ్చరిస్తున్నాయి. అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ‘క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌’ రూపొందించిన కొత్త ట్రాకర్‌ ప్రకారం.. 2026 అక్టోబర్‌ నుంచి 2027 మార్చి వరకు భారత్‌లో అధిక వేడి కారణంగా సాధారణ స్థాయికి మించి సుమారు 55 వేల మరణాలు సంభవించే అవకాశం ఉంది. వీటిలో ఎక్కువ భాగం మార్చిలోనే నమోదయ్యే...