మాసబ్‌ట్యాంక్‌లో పాలిటెక్నిక్ విద్యార్థులతో వివేక్ వెంకటస్వామి ముఖాముఖి ఆందోళనలకు కారణాలు అడిగి తెలుసుకుని.. సందేహాలను నివృత్తి చేసిన మంత్రి
హైదరాబాద్, ఆగస్టు 21,అర్జున్ సమాచార0: హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఆందోళన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థుల వద్దకు శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వెళ్లి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. పాలిటెక్నిక్‌లను శక్తి శాఖ పరిధిలోకి తీసుకురావడంపై విద్యార్థుల్లో నెలకొన్న సందేహాలు, అపోహలు, ఆందోళనలను మంత్రి ఓపికగా విని.. ఒక్కొక్క అంశంపై స్పష్టత ఇచ్చారు. విద్యార్థుల విద్య, ఫీజులు, పరీక్షలు, డిప్లొమా గుర్తింపు, ఈసెట్, లేటరల్ ఎంట్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్,...