హైదరాబాద్,అర్జున్ సమాచారం:
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసినప్పటికీ,కాంగ్రెస్ వైపు వెళ్లిన మిగిలిన 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా సేఫ్ జోన్‌లోనే ఉన్నారు.
దానం నాగేందర్ కాంగ్రెస్ బి-ఫామ్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడమే పార్టీ ఫిరాయింపునకు తిరుగులేని చట్టపరమైన ఆధారంగా మారింది.
మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరినట్లు ఎలాంటి పత్రాలు గానీ,వేరే పార్టీ బి-ఫామ్‌లు గానీ దాఖలు చేయలేదు.
కేవలం కండువాలు కప్పుకోవడం,ఫోటోలు,పేపర్ క్లిప్పింగులు మాత్రమే కోర్టుల్లో చట్టబద్ధమైన ఫిరాయింపు సాక్ష్యాలుగా నిలబడవని సుప్రీంకోర్టు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి.
అసెంబ్లీ రికార్డుల్లో వారంతా ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారు. దీంతో బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నప్పటికీ, మిగిలిన 9 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలకు తక్షణమే ఎలాంటి న్యాయపరమైన ముప్పు లేదని న్యాయనిపుణుల అంచనా.. ఆ 9 మందిలో ఒకరు ఇప్పటికే బీఆర్ఎస్‌లో మళ్లీ కలసిపోయారు.
=========================