మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు సేఫ్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసినప్పటికీ,కాంగ్రెస్ వైపు వెళ్లిన మిగిలిన 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా సేఫ్ జోన్‌లోనే ఉన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ బి-ఫామ్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడమే పార్టీ ఫిరాయింపునకు తిరుగులేని చట్టపరమైన ఆధారంగా మారింది. మిగిలిన 9 మంది ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరినట్లు ఎలాంటి పత్రాలు గానీ,వేరే పార్టీ బి-ఫామ్‌లు గానీ దాఖలు చేయలేదు. కేవలం కండువాలు కప్పుకోవడం,ఫోటోలు,పేపర్ క్లిప్పింగులు మాత్రమే కోర్టుల్లో చట్టబద్ధమైన ఫిరాయింపు...