ముఖ్యమంత్రిశ్రీ చంద్రబాబు నాయుడుకు శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వానం ఆహ్వాన పత్రిక అందజేసిన టీటీడీ ఛైర్మన్, ఈవో
తిరుమల,అర్జున్ సమాచారం: తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టీటీడీ ఘనంగా ఆహ్వానించింది. ఈ మేరకు అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో టీటీడీ బోర్డు ఛైర్మన్ బీఆర్ నాయుడు, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, పనబాక లక్ష్మీ, జానకిదేవి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి శ్రీవారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు...