ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై ప్రధాన చర్చ శక్తిసామర్థ్యాల ఆధారంగానే సీట్ల పంపకంపై నిర్ణయం బీసీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు తర్వాతే ఎన్నికల షెడ్యూల్ వైసీపీకి ఒక్క స్థానం దక్కకుండా చూడాలనే పట్టుదల

ఉండవల్లి,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మధ్య కీలక సమావేశం జరిగింది. మంగళవారం ఉదయం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. అనంతరం ముగ్గురు నేతలు బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించిన‌ట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కూటమి పక్షాలు కలిసికట్టుగా పనిచేయాలని ఈ భేటీలో...