ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి… జూలై 2న ముక్కవారిపల్లికి రానున్న సీఎం చంద్రబాబు, డెప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఎస్పీ.ఎల్. సుబ్బరాయుడు.

తిరుపతి ,అర్జున్ సమాచారం : ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి పంచాయతీ వద్ద జూలై 2న నిర్వహించనున్న ‘వికసిత్ భారత్ - గ్యారెంటీ ఫర్ రోజ్గర్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్’ (వీబీజీ రాంజీ) పథకం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి చిన్నపాటి లోపాలకు తావివ్వకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్...