ముడి పొగాకుపై జీఎస్టీ 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన ఏపీ మంత్రులు, ఎంపీల బృందం

న్యూఢిల్లీ, జూలై 21,అర్జున్ సమాచారం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సహచర మంత్రులు, ఎంపీలతో కలసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని పార్లమెంట్ లో కలిసి ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు...