మూడు రోజుల వ్యాపారానికీ జీఎస్టీ దీపావళి వ్యాపారులను హడలెత్తిస్తున్న లైసెన్సుల ఫీజులు సాధారణ అనుమతులతోపాటు కొత్తగా జీఎస్టీ వసూళ్లు చిన్నపాటి షాపుపైనా రూ.15 వేల నుంచి 20 వేల వరకు భారం అంతిమంగా సామాన్యులపై ధరల ప్రభావం
హైదరాబాద్,అర్జున్ సమాచారం: దీపావళి కాంతుల సంగతేమో కానీ.. అధికారుల మామూళ్లు, లైసెన్సుల ఫీజులతో పాటు ఈసారి కొత్తగా జీఎస్టీ వసూళ్లు తమకు చుక్కలు చూపెడుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. గతంతో పోల్చితే ఈసారి అన్ని ఫీజులూ అధికం కావడంతో అసలు దుకాణం పెట్టాలా.. వద్దా.. అని చాలామంది ఆలోచిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో సుమారు 30-40 మంది హోల్సేల్ వ్యాపారులున్నారు. వీరి ద్వారా కేవలం 20 శాతం మాత్రమే వ్యాపారం జరుగుతుండగా, మిగిలిన 80 శాతం అసంఘటిత రంగంలోని రిటైల్ వ్యాపారుల ద్వారా లేదంటే ఆన్లైన్లో జరుగుతుంటాయి....