మెడికల్ షాపులపై ఆకస్మిక తనిఖీలు ప్రిస్క్రిప్షన్ లేకుండా నియంత్రిత మందులు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు
గోదావరిఖని: అర్జున్ సమాచారం: రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ బి.శ్రీనివాస్ రావు నేతృత్వంలో ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడికల్ షాపులపై నార్కోటిక్,డ్రగ్స్ నిరోధక శాఖ మరియు సీఐఎస్ఎఫ్ విజిలెన్స్ బృందాలు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ట్రామడాల్, టాపెంటడాల్, నైట్రాజెపామ్, ప్రెగాబాలిన్, జోల్పిడెమ్, అల్ప్రాజోలం,కోడిన్ కలిగిన దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించిన రికార్డులు,వైద్యుల ప్రిస్క్రిప్షన్లు,సేల్స్ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత ఔషధ చట్టాలు, నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయాలు జరుగుతున్నాయా అనే అంశాన్ని తనిఖీ చేశారు....