ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 8:30 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

మెడికవర్ ఆసుపత్రిలో రోగి మృతి ఘటన సోషల్ మీడియాలో అవాస్తవాల ప్రచారం స్పందించిన యాజమాన్యం

సికింద్రాబాద్.
అర్జున్ సమాచారం:
సికింద్రాబాద్ మెడికవర్ ఆసుపత్రిలో రోగి మృతి ఘటనపై స్పందించిన యాజమాన్యం, తప్పుడు ప్రచారంపై సమగ్ర విచారణకు డీజీపీని కోరనున్నట్లు వెల్లడించింది. హాస్పటల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో హాస్పిటల్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ మాట్లాడుతూ యువ రోగి మృతి పట్ల విషాదం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రోగి వచ్చినప్పటి పరిస్థితితో పాటు చికిత్స విధానం గురించి చెబుతూ  వైద్యులు అవసరమైన చికిత్సలు మాత్రమే అందచేయడం జరిగిందని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి కొన్ని వేదికల్లో వాస్తవాలకు విరుద్ధమైన సమాచారం ప్రచారం అవుతున్న నేపథ్యంలో ప్రజలకు  సరైన వివరాలు తెలియాల్సిన అవసరం ఉందని ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రోగి బయటి డయాగ్నస్టిక్ సెంటర్‌లో చేయించుకున్న సీటీ స్కాన్‌తో ఆసుపత్రికి వచ్చారని, ఆ నివేదికలో సుమారు 16 × 17 × 20 మిల్లీమీటర్ల పరిమాణంలో కిడ్నీ రాయి ఉన్నట్లు, అది మూత్ర ప్రవాహానికి అడ్డంకిగా మారడంతో మూత్రపిండంలో వాపు ఏర్పడినట్లు వెల్లడైందని ఆ పరిమాణంలో ఉన్న రాయిని తొలగించడానికి శస్త్ర చికిత్స తప్పనిసరి అని అందుకే శస్త్ర చికిత్స చేసి తొలగించడం జరిగిందని చెప్పారు. కానీ 1ఎంఎం, 2ఎంఎం అని రాయి అని సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసారని అన్నారు.  కొంతమంది వ్యక్తులు మెడికవర్ హాస్పిటల్ కు ఒక రాజకీయ పార్టీ నేతకు సంబంధం అంతకడుతూ తమ సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే ప్రయత్నం చేసారని వారిపైన చట్ట రిత్యా చర్యలు తీసుకోవాలని కోరడంతో పాటు పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు వెల్లడించారు.