మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న ‘ది ప్యారడైజ్’ టీం

నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకొని చిత్ర బృందం తాజాగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు. నాని, చిత్ర బృందానికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అమ్మవార్ల సన్నిధికి చేరుకున్న నాని వనదేవతలకు తమ బరువుకు తూగేలా నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల ఆశీస్సులు తీసుకున్నారు. పూజారులు చిత్ర బృందానికి అమ్మవారి ప్రసాదం అందజేశారు. నానిని చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు....