మైనర్ బాలికపై అత్యాచారం చేసి, సజీవ దహనం చేసి హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష బాధితురాలి కుటుంబానికి ఐదు లక్షల రూపాయల పరిహారం ఇవ్వవలసినదిగా ప్రభుత్వాన్ని ఆదేశించిన కోర్టు

బద్వేలు: మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి, అనంతరం సజీవ దహనం చేసి హత్య చేసిన కేసులో నేరం రుజువు కావడంతో కడప కోర్టు నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.8,000/- జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. బాధితురాలి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిడమైనది. వై.యస్.ఆర్. కడప జిల్లా బద్వేలు రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 231/2024, బి ఎల్ ఎస్ -2023 సెక్షన్లు 64, 103,...