మొబైల్ చోరీదారులకు పోలీసుల షాక్..! 32 ఫోన్లు రికవరీ చేసి యజమానులకు అప్పగింత భద్రాచలంలో 32 పోయిన మొబైల్ ఫోన్ల రికవరీ సాంకేతిక పరిజ్ఞానంతో ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగించిన పోలీసులు
భద్రాచలం, అర్జున్ సమాచారం: భద్రాచలం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ సందర్భాల్లో పోయిన మొబైల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో పోలీసులు రికవరీ చేశారు. మొత్తం 32 మొబైల్ ఫోన్లను గుర్తించి, వాటిని సంబంధిత బాధితులు, యజమానులకు భద్రాచలం డీఎస్పీ యం. అరుణ్‌కుమార్ సమక్షంలో మంగళవారం అప్పగించారు.మొబైల్ ఫోన్లు పోయినట్లు బాధితుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు వాటి వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్ల ఆచూకీని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రికవరీ చేసిన ఫోన్లను బాధితులకు...