హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ డీజీపీ సి. వి. ఆనంద్, యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ (వైఐపిఎస్) అకాడమిక్ బ్లాక్ నిర్మాణానికి ₹2 కోట్ల సీఎస్సార్ అందించిన ఎంవైకే లాటిక్రెట్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
పోలీస్ సిబ్బంది పిల్లలతో పాటు సాధారణ పౌరుల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటువంటి సంస్థలు అందించే సహకారం వైఐపిఎస్ లో మెరుగైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి, విద్యార్థులకు ఎన్నో సంవత్సరాల పాటు ఉపయోగపడే సౌకర్యాలను కల్పించడానికి తమ ప్రయత్నాలకు ఎంతో విలువైన తోడ్పాటును అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సీఎస్సార్ ఫండ్ ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు దోహదపడుతుందని డీజీపీ తెలిపారు.
ఎంవైకే లాటిక్రెట్ మేనేజింగ్ డైరెక్టర్ మురళి యాదమా, అయన వారి బృందానికి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనందుకు డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు. వైఐపిఎస్ ద్వారా ప్రయోజనం పొందే విద్యార్థులకు వారి ఈ సహకారం చిరకాలం గుర్తుండిపోయే విలువైన మద్దతుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
======================