యశోద ఆస్పత్రిలో ప్లాస్టిక్‌ శస్త్రచికిత్సల ప్రత్యేక కేంద్రం అత్యాధునిక సౌందర్య, పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు ఒకేచోట ప్రముఖ ప్లాస్టిక్‌ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ శశికాంత్‌ మద్దు

కరీంనగర్‌,అర్జున్ సమాచారం: సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో ప్రముఖ ప్లాస్టిక్‌ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్‌ శశికాంత్‌ మద్దు ఆధ్వర్యంలో ‘ప్లాస్టిక్‌ శస్త్రచికిత్సల అత్యుత్తమ కేంద్రం’ను ప్రారంభించారు. ఈ కేంద్రంలో సౌందర్య, పునర్నిర్మాణ శస్త్రచికిత్సలతో పాటు రైనోప్లాస్టీ, లైపోసక్షన్‌, చిన్నారుల క్లిష్టమైన పునర్నిర్మాణ శస్త్రచికిత్సలకు ప్రత్యేక సేవలు అందించనున్నారు.అని గురువారం రోజున కరీంనగర్ యశోద సెంటర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో డా శశికాంత్ వివరాలను వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,ముఖ సౌందర్యంతో పాటు, శ్వాస సంబంధిత సమస్యలను సరిదిద్దేందుకు ప్రాథమిక, పునః,...