యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు..
యాదాద్రి, అక్టోబర్ 31,అర్జున్ సమాచారం: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా దర్శించుకున్నారు. శ్రీ జనార్దనానంద సరస్వతి స్వామి సంస్కృతి ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 28 నుంచి దేవస్థానంలో తెలంగాణ వేద విద్వన్మహాసభలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి శనివారం గవర్నర్ దంపతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్టపై ఉన్న అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్కు మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి...