యూట్యూబ్‌లో తప్పుడు ప్రకటనలు గేదెలు బర్రెలు విక్రయిస్తున్నట్లు నమ్మించి ప్రజలను మోసం చేసిన సైబర్ క్రైం నిందితుడు అరెస్ట్
సిద్దిపేట,అర్జున్ సమాచారం: మార్కూక్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన సైబర్ మోసం కేసును గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ డి. రవి రాజు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.కేసు వివరాల్లోకి వెళితే, పల్లె సాయికిరణ్, తండ్రి శ్రీశైలం, నివాసం బీరంగూడ, అమీన్‌పూర్, లక్ష్మీ డెయిరీ ఫార్మ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ,గేదెలు,బర్రెలు అమ్మకానికి ఉన్నట్లు వీడియోలు అప్లోడ్ చేసేవాడు. వీడియోలలో చూపించిన ఫోన్ నంబర్‌కు సంప్రదించిన అమాయక ప్రజలను నమ్మించి, ముందుగా అడ్వాన్స్ చెల్లించాలని చెప్పి వారి నుంచి ఆన్‌లైన్ ద్వారా డబ్బులు తీసుకుని...