యూపీలో టగ్ ఆఫ్ వార్… కమలానికి డేంజర్ బెల్స్
లక్నో, అక్టోబరు 29,అర్జున్ సమాచారం: ఉత్తరప్రదేశ్ శాసనమండలి ద్వైవార్షిక ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీకి తిరుగులేని కంచుకోటలుగా భావించే పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ చొచ్చుకుపోయింది. మొత్తం 11 స్థానాలు 5 గ్రాడ్యుయేట్స్, 6 టీచర్స్ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 5 స్థానాలను గెలుచుకోగా, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ 4 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. కేవలం ఒక్క సీటు తేడాతో అధికార పార్టీ మెజార్టీని అడ్డుకోవడమే కాకుండా, విద్యావంతులు, ఉద్యోగుల...