యూపీలో హై బీపీ….
లక్నో,అర్జున్ సమాచారం: దేశ రాజకీయాలకు దిక్సూచి లాంటి ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం క్రమంగా సవాలును ఎదుర్కొంటోందన్న చర్చ అంతటా ఊపందుకుంది. 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో తిరుగులేని జయభేరి మోగించిన బీజేపీకి.. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు షాక్ ఇచ్చారు. అక్కడితో ఆగలేదని యూపీలో కమలదళం గ్రాఫ్ ఇంకా కిందకే జారుతోందని, ప్రతిపక్ష ఇండియా కూటమి ఊపందుకుంటోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో 2027లో జరగబోయే అసెంబ్లీ సమరంలో బీజేపీకి హ్యాట్రిక్ విజయం...