యూపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలానికి షాక్ మొత్తం 11 స్థానాలకు గాను బీజేపీ 6, ఎస్‌పీ 5 చోట్ల విజయం గతంతో పోలిస్తే రెండు స్థానాలు అదనంగా గెలుచుకున్న సమాజ్‌వాదీ పార్టీ 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలకంగా మారిన ఎన్నికలు కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని అఖిలేశ్ యాదవ్ ఆరోపణ
లక్నో,అర్జున్ సమాచారం: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సుమారు ఐదు నెలల ముందు జరిగిన శాసనమండలి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు చెందిన 11 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ ఆరు స్థానాలను కైవసం చేసుకోగా, ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) ఐదు స్థానాల్లో గెలిచి అనూహ్యమైన పురోగతి కనబరిచింది. అక్టోబర్ 23న బ్యాలెట్ పత్రాల ద్వారా ఈ ఎన్నికల పోలింగ్ జరగ్గా, అక్టోబర్ 27న ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ...