యోగి ఆదిత్యనాథ్ తల్లి సావిత్రి దేవి కన్నుమూత – ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామం పంచూర్లో 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస – పుట్టెడు దుఃఖంలోనూ ముందుగా నిర్ణయించిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఉత్తరాఖండ్:
ఉత్తరాఖండ్: అర్జున్ సమాచారం: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి సావిత్రి దేవి (91) కన్నుమూశారు. ఉత్తరాఖండ్‌లోని పౌరీ గఢ్వాల్ జిల్లాలో ఉన్న తమ స్వగ్రామం పంచూర్‌లోని నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సావిత్రి దేవి మరణవార్తను పౌరీ గఢ్వాల్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్ఎస్పీ) సర్వేశ్ పన్వార్ ధ్రువీకరించారు. ఆమె భౌతికకాయానికి రేపు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో...