రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష ఐఏఎస్ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం.

అర్జున్ సమాచారం: కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన కేసులో (కోర్టు ధిక్కరణ) రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి తెలంగాణ హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్ష, రూ. 2,000 జరిమానా విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. న్యాయస్థానం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సదరు ఐఏఎస్ (IAS) అధికారి తీరుపై జస్టిస్ కె. లక్ష్మణ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. * భూముల వివాదం: రంగారెడ్డి జిల్లాలోని మూడు ల్యాండ్ పార్సిళ్లను (ప్లాట్లను) రిజిస్ట్రేషన్ చట్టం-1908లోని సెక్షన్ 22-A...