రక్షాబంధన్ వేడుకల్లో పాల్గోన్నబండారు దత్తాత్రేయ హైదరాబాద్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: మహిళా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రక్షాబంధన్ వేడుకల్లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ సోదర–సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర రక్షణకు ప్రతీక అన్నారు. మహిళా నాయకులు, కార్యకర్తలు, బ్రహ్మకుమారీలు, పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రక్షాబంధన్ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరి జీవితంలో సుఖసంతోషాలు, శాంతి, ఆరోగ్యం నెలకొనాలని అయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు హైదరాబాద్ నగర్ మాజీ...