రవితేజ, దిల్‌రాజు ల మూవీ #SVC64 త్వరలో టైటిల్ అనౌన్స్‌మెంట్
‘ఇరుముడి’ సంచలన బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న మాస్ మహారాజా రవితేజ, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. దర్శకుడు హసిత్ గోలితో కలిసి రవితేజ ఓ హార్డ్‌కోర్ ఎంటర్‌టైనర్ చేయనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ, హసిత్ గోలి, ఎస్వీసీ కాంబినేషన్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో కమర్షియల్ ఎంటర్‌టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే.. వైవిధ్యమైన కథలు, హ్యూమర్ తో హసిత్ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు....