రష్యా విమానాల చొరబాటు.. దక్షిణ కొరియాలో వాయుదాడి హెచ్చరిక.. యుద్ధ విమానాల మోహరింపు – దక్షిణ కొరియా సమీపంలోకి రష్యా సైనిక విమానాలు – వెంటనే ఫైటర్ జెట్లను రంగంలోకి దించిన కొరియా వైమానిక దళం – గగనతల ఉల్లంఘన జరగలేదని స్పష్టం చేసిన సైన్యం – ఉల్లెంగ్ ద్వీపంలో పొరపాటు హెచ్చరికతో స్వల్ప గందరగోళం
దక్షిణ కొరియా: దక్షిణ కొరియా తూర్పు తీరంలో మంగళవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రష్యన్ సైనిక విమానాలు తమ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్ (ఏడీఐజడ్)లోకి ప్రవేశించడంతో, దక్షిణ కొరియా వైమానిక దళం తక్షణమే స్పందించి తమ ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. రష్యన్ విమానాలు జోన్లోకి ప్రవేశించక ముందే వాటి కదలికలను గుర్తించిన దక్షిణ కొరియా సైన్యం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యగా తమ ఫైటర్ జెట్ల ద్వారా 'టాక్టికల్ మాన్యువర్స్' నిర్వహించింది. కొద్దిసేపటి తర్వాత రష్యన్...