రాంజీగూడ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ కేరమేరి:

కేరమేరి:అర్జున్ సమాచారం: కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని రాంజీగూడ ఆశ్రమ ఉన్నత పాఠశాలను గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన గిరిజన సంక్షేమ శాఖ ఏఈ నజీమోద్దీన్‌తో కలిసి పాఠశాలలోని వివిధ వసతులను పరిశీలించారు. పాఠశాల భవనం, ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించిన డిప్యూటీ డైరెక్టర్, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలపై ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యాభ్యాసం,...