రాఖీ పండుగ వేళ సింగరేణి కార్మికులకు ఆత్మీయ పలకరింపు ఆర్జీ-1 సింగరేణి గనుల వద్ద కార్మికులకు రాఖీలు కట్టిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి కార్మికుల చేతులకు రాఖీలు కట్టి.. స్వీట్లు తినిపించిన బీజేపీ శ్రేణులు అన్నా–చెల్లెలు, అక్క–తమ్ముళ్ల అనుబంధానికి రాఖీ పండుగ ప్రతీక: కందుల సంధ్యారాణి
గోదావరిఖని,అర్జున్ సమాచారం: అన్నా–చెల్లెలు, అక్క–తమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను పురస్కరించుకుని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి బీజేపీ శ్రేణులతో కలిసి గోదావరిఖనిలోని ఆర్జీ-1 సింగరేణి గనుల వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా గనుల్లో విధులు నిర్వహిస్తున్న సింగరేణి కార్మికులను ఆప్యాయంగా పలకరించి వారి చేతులకు రాఖీలు కట్టి, స్వీట్లు తినిపించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ వారి క్షేమ సమాచారాన్ని, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ.....